: సిద్ధిపేట, వికారాబాద్ లను జిల్లాలుగా మారుస్తాం: హరీష్ రావు హామీ
మెదక్ జిల్లాలోని సిద్ధిపేట, రంగారెడ్డి జిల్లాలోని వికారాబాద్ లను జిల్లాలుగా మారుస్తామని తెలంగాణ భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు అన్నారు. ఈ రోజు ఆయన రంగారెడ్డి జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా, వికారాబాద్ ను కొత్త జిల్లాగా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ వ్యాపారులు ర్యాలీ చేపట్టారు. దీంతో, ఆయన కొత్త జిల్లాల హామీ ఇచ్చారు. అయితే, వ్యాపారులు చేపట్టిన ర్యాలీలో టీఆర్ఎస్ శ్రేణులు కూడా ఉండటంతో, వారిపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేసినట్టు సమాచారం.