: ఆర్ అండ్ బీ, రవాణా శాఖల్లో అవినీతి తారస్థాయికి చేరింది: మంత్రి సిద్ధా
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రహదారులు, భవనాల శాఖ, రవాణా శాఖల్లో అవినీతి తారస్థాయికి చేరిందని ఏపీ రవాణాశాఖ మంత్రి సిద్ధా రాఘవరావు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రహదారుల శాఖ అధికారులు కాంట్రాక్టర్లతో కుమ్మక్కై, పనుల నాణ్యతను గాలికి వదిలేశారని మండిపడ్డారు. మడకశిర వద్ద బస్సు ప్రమాదం విచారణలో ఇదే తేలిందని చెప్పారు. తడ చెక్ పోస్టు వద్ద అధికారులు బరితెగించి వ్యవహరిస్తున్నారని అన్నారు. అధికారులు తమ తీరు మార్చుకోకపోతే కఠిన చర్యలు తీసుకోక తప్పదని హెచ్చరించారు.