: సంక్రాంతి సంబరాల్లో పందెంరాయుళ్ల జోరు... కోడిపందాలకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్!


ఈ ఏటి సంక్రాంతి వేడుకలు ఏపీలో అత్యంత అట్టహాసంగా జరగనున్నాయి. పందెంరాయుళ్ల పొలికేకలతో కోస్తాంధ్ర పల్లెలు మారుమోగనున్నాయి. సంక్రాంతి సందర్భంగా నిర్వహించే కోడిపందాలకు సుప్రీంకోర్టు పచ్చజెండా ఊపింది. కోడిపందాలపై వారం రోజులుగా కొనసాగుతున్న ఉత్కంఠకు తెరదించుతూ కొద్దిసేపటి క్రితం సుప్రీంకోర్టు ధర్మాసనం, కోడిపందాలు నిర్వహించుకోవచ్చంటూ తీర్పు చెప్పింది. కోడిపందాలను నిషేధిస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ పారిశ్రామికవేత్త, బీజేపీ నేత రఘురామకృష్టంరాజు సుప్రీంకోర్టు గడప తొక్కారు. ఈ పిటిషన్ విచారణను రెండు సార్లు వాయిదా వేసిన సుప్రీంకోర్టు కొద్దిసేపటి క్రితం తీర్పు చెప్పింది. సమస్యను పరిష్కరించే బాధ్యతను హైకోర్టుకే అప్పగిస్తూ తీర్పు చెప్పిన సుప్రీంకోర్టు, అప్పటిదాకా యథాతథ స్థితిని కొనసాగించాలని ఆదేశిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

  • Loading...

More Telugu News