: షర్మిల యాత్రను విజయవంతం చేయండి: టి.వైకాపా
ఈ నెల 21 నుంచి నల్గొండ జిల్లాలో వైకాపా అధినేత జగన్ సోదరి షర్మిల చేపట్టనున్న పరామర్శ యాత్రను విజయవంతం చేయాలని తెలంగాణ వైకాపా ప్రధాన కార్యదర్శులు గట్టు శ్రీకాంత్ రెడ్డి, ఎర్నేని వెంకటరత్నం కోరారు. పరామర్శ యాత్ర దేవరకొండ, నాగార్జున సాగర్, మిర్యాలగూడ, హుజూర్ నగర్, కోదాడ, సూర్యాపేట నియోజకవర్గాల్లో కొనసాగుతుందని తెలిపారు. వైయస్ రాజశేఖర రెడ్డిపై అభిమానం పెంచుకున్న లక్షలాది మంది ఆయన మరణాన్ని తట్టుకోలేక పోయారని చెప్పారు. వైయస్ ప్రారంభించిన సంక్షేమ పథకాలతో మధ్యతరగతి, పేద, బడుగు, బలహీన వర్గాలు లబ్ధిపొందాయని అన్నారు. షర్మిల యాత్రకు వైకాపా నేతలు, కార్యకర్తలు, అభిమానులు భారీ సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని విన్నవించారు.