: మడకశిర ప్రమాదంలో మృతుల సంఖ్య పదహారు... డ్రైవర్ గంగప్ప మృతి
అనంతపురం జిల్లా మడకశిర ఆర్టీసీ బస్సు ప్రమాదంలో మరణించిన వారి సంఖ్య 16కు చేరింది. ఈ నెల 7న మడకశిర నుంచి పెనుగొండకు బయలుదేరిన ఆర్టీసీ బస్సు 20 అగుడుల లోయలో పడ్డ సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో తొమ్మిది మంది విద్యార్థులు సహా 15 మంది మృత్యువాత పడ్డారు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ డ్రైవర్ గంగప్ప సహా క్షతగాత్రులను ఏపీ ప్రభుత్వం బెంగళూరు తరలించింది. బెంగళూరులోని మణిపాల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న డ్రైవర్ గంగప్ప నేటి ఉదయం మృతి చెందాడు. దీంతో ఈ ప్రమాదంలో మరణించిన వారి సంఖ్య 16కు చేరింది.