: గోవా టూర్ రద్దు చేసుకుంటున్న రష్యన్ టూరిస్టులు!
గోవా రాష్ట్రానికి పర్యాటకం ద్వారా పెద్ద మొత్తంలో ఆదాయం వస్తుందన్న సంగతి తెలిసిందే. అయితే, కొంతకాలంగా ఈ రాష్ట్రానికి వచ్చే పర్యాటకుల సంఖ్య తగ్గుతూ వస్తోంది. ముఖ్యంగా, రష్యన్లు గోవా పర్యటనను రద్దు చేసుకుని, స్పెయిన్, పోర్చుగల్ బాటపడుతున్నారట. దీనిపై రష్యన్ కాన్సులేట్ లీగల్ అడ్వైజర్ విక్రమ్ వర్మ మాట్లాడుతూ, ఈ సీజన్ లో 40 వేల మందికిపైగా రష్యన్లు గోవాలో గడిపేందుకు బదులు ఇతర యూరోపియన్ దేశాలకు మరలిపోయారని తెలిపారు. వచ్చే సీజన్ లోనూ ఇదే పరిస్థతి కొనసాగవచ్చని అభిప్రాయపడ్డారు. గోవాలోని టాక్సీ డ్రైవర్లు రష్యన్ టూరిస్టుల పట్ల అనుచితంగా ప్రవర్తిస్తున్నారంటూ సోషల్ మీడియాలో సాగుతున్న ప్రతికూల ప్రచారమే కీలక కారణమని వర్మ వివరించారు. దీంతో, రష్యన్లు తమ భారత ప్రయాణాన్ని రద్దు చేసుకుంటున్నారని తెలిపారు.