: ఏకంగా నాలుగు గ్రామాలను దత్తత తీసుకున్న జైట్లీ


కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఏకంగా నాలుగు గ్రామాలను దత్తత తీసుకున్నారు. 'సన్సద్ ఆదర్శ్ గ్రామ్ యోజన' పథకంలో భాగంగా గుజరాత్ లోని వడోదర జిల్లాలో కర్ణాలి, పిపాలియా, వలీదా, బాగ్లీపురా గ్రామాలను దత్తత తీసుకున్నట్టు జైట్లీ తెలిపారు. ఈ మేరకు తన ఫేస్ బుక్ పేజీలో పోస్టు పెట్టారు. ఈ యోజన పథకాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ఎర్రకోటపై స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగం సందర్భంగా ప్రకటించారు. ఈ పథకం ద్వారా ఎంపీలు గ్రామాలను ఆదర్శ గ్రామాలుగా అభివృద్ధి చేసేందుకు కేంద్రం తగిన ప్రోత్సాహం అందిస్తుంది.

  • Loading...

More Telugu News