: అమ్మాయిలను ఎరగా వేస్తారు... జాగ్రత్త సుమా!: కివీస్ ఆటగాళ్లకు మిల్స్ సూచన


ఆస్ట్రేలియాతో సంయుక్తంగా క్రికెట్ వరల్డ్ కప్ కు ఆతిథ్యమిస్తున్న న్యూజిలాండ్ ఫిక్సింగ్ పై ఉదాసీనత ప్రదర్శించరాదని భావిస్తోంది. మెగా ఈవెంట్ పై ఫిక్సింగ్ మాఫియా ప్రత్యేక దృష్టి పెడుతుందని, ముఖ్యంగా ఆటగాళ్లకు అందమైన అమ్మాయిలను ఎరగా వేసే అవకాశాలున్నాయని క్రికెట్ ప్లేయర్స్ అసోసియేషన్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ హీత్ మిల్స్ ఈ మేరకు హెచ్చరించారు. మ్యాచ్ ఫిక్సింగ్ ముఠాలకు న్యూజిలాండ్ లోనూ సభ్యులున్నారని తెలిపారు. ఫిక్సింగ్ అంశంపై ఆటగాళ్లకు గంటన్నర నిడివి ఉన్న ప్రజెంటేషన్ ఇచ్చామని, అమ్మాయిలను పంపి ఉచ్చులోకి లాగుతారన్న విషయాన్ని కూడా విడమర్చామని మిల్స్ చెప్పారు.

  • Loading...

More Telugu News