: సంక్రాంతి కానుకపై దుష్ప్రచారం మంచిది కాదు: బాబు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకు సంక్రాంతి కానుకగా అందిస్తున్న చంద్రన్న పథకంపై దుష్ప్రచారం చేయడం సరికాదని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు హితవు పలికారు. ధాన్యంపై అధికారులతో సమీక్ష సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ధాన్యం కొనుగోలును ముమ్మరం చేయాలని సూచించారు. గత ఏడాది జనవరి 11 వరకు 14,82, 568 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయగా, ఈ ఏడాది జనవరి 11 నాటికి కేవలం 19,10,960 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించారు.