: గుజరాత్ లో సోలార్ పార్క్ ఏర్పాటు చేయనున్న అదానీ, సన్ ఎడిషన్


గుజరాత్ లో సోలార్ పార్కును ఏర్పాటు చేయనున్నట్టు అదానీ, సన్ ఎడిషన్ సంస్థలు తెలిపాయి. ఉజ్వల గుజరాత్ సదస్సులో పాల్గొన్న సందర్భంగా గుజరాత్ కు నిధుల వెల్లువ ఆగేలా కనపడడం లేదు. ముఖేష్ అంబానీ రిలయన్స్ సంస్థ తరపున లక్ష కోట్ల రూపాయల పెట్టుబడులు పెడతామని ప్రకటించిన కాసేపటికే, అదానీ, సన్ ఎడిషన్ సంస్థలు గుజరాత్ లో సోలార్ పార్క్ ఏర్పాటు చేసేందుకు 25 వేల కోట్ల రూపాయలను వెచ్చించనున్నామని తెలిపాయి. సోలార్ పార్క్ లో సుమారు 20 వేల మందికి ఉపాధి లభిస్తుందని ఆ సంస్థలు వెల్లడించాయి.

  • Loading...

More Telugu News