: బంగ్లాదేశ్ క్రికెటర్ కు ఊరట...వరల్డ్ కప్ ముందు బెయిల్
అత్యాచార ఆరోపణలతో అరెస్టయిన బంగ్లాదేశ్ క్రికెటర్ రూబెల్ హుస్సేన్ కు ఊరట లభించింది. ఢాకా కోర్టు అతడికి బెయిల్ మంజూరు చేసింది. పోలీసులు చార్జిషీట్ దాఖలు చేసే వరకు అతడికి బెయిల్ ఇస్తున్నట్టు ప్రకటించింది. పెళ్లి చేసుకుంటానని చెప్పి, తనపై అత్యాచారం చేశాడంటూ 19 ఏళ్ల మోడల్, హీరోయిన్ ఫిర్యాదు చేయడంతో అతడిని అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. అతను తీసుకున్న ముందస్తు బెయిల్ గడువు ముగియడంతో ఈ నెల 8న అతడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాగా, ఆయనకు మరోసారి బెయిల్ లభించడంతో, అతనిని వరల్డ్ కప్ బంగ్లా జట్టులో చేర్చుకుంటారా? లేదా? అనేది తెలియాల్సి ఉంది.