: రోజుల పాపాయికి లక్షల బహుమతి


పుట్టి నెలరోజులైనా కాలేదు...కానీ పుట్టింటికి సిరులు తెచ్చిందా ఆడపిల్ల. తెలుగు సంప్రదాయంలో ఆడపిల్ల పుడితే లక్ష్మీదేవి పుట్టిందని సంబరపడతారు. అలాగే ఓ పసిపాప పుడుతూనే పుట్టింటికి సిరులుతెచ్చింది. కేరళకు చెందిన అనీల్ జనార్ధనన్ దంపతులకు గతనెలలో పాప పుట్టింది. దీంతో పాప కోసం 20వ దుబాయ్ షాపింగ్ ఫెస్టివల్ లో తన కుమార్తె నితేరా జనార్ధనన్ పేరిట నగలు కొన్నాడు. ఈ సందర్భంగా మూడు కూపన్లు తీసుకుని వాటిని ఫిల్ చేసి బాక్స్ లో వేశాడు. శనివారం ఆ షాపింగ్ మాల్ విజేతలను ప్రకటించింది. ఆ లక్కీ డ్రాలో నితేరా పేరిట ఉన్న కూపన్ కు 1,40,000 దిర్హామ్స్ విలువైన బంగారు, వజ్రాల నగలు బహుమతిగా లభించాయి. అంటే వీటి విలువ భారతీయ కరెన్సీలో 24 లక్షల రూపాయల వరకు ఉంటుంది. దీంతో 28 రోజుల తమ చిన్నారి తల్లిదండ్రుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.

  • Loading...

More Telugu News