: ఉగ్రవాదుల బారి నుంచి పలువురిని రక్షించిన ముస్లిం యువకుడు
ముస్లిం ఉగ్రవాదుల దాష్టీకాలకి బలవుతున్నామంటూ, ఓ జాతి మొత్తాన్ని దోషులను చేసే వారికి, పారిస్ ఉగ్రదాడిలో ఓ ముస్లిం యువకుడు సమాధానం చెప్పాడు. ముస్లింలంతా ఉగ్రవాదులు కాదని ప్రపంచానికి చాటాడు. పారిస్ లోని పత్రికా కార్యాలయంపై దాడి జరిపిన అనంతరం, తూర్పు పారిస్ లోని కొషెర్ మార్కెట్ లోకి ప్రవేశించిన ఉగ్రవాదులు పలువురిని బందీలుగా పట్టుకున్నారు. దీనిని గమనించిన సూపర్ మార్కెట్ ఉద్యోగి లసానా బాతిలి (24) అప్రమత్తమయ్యాడు. వెంటనే కరెంట్ తీసేశాడు. సూపర్ మార్కెట్ లో సామాన్లు కొనుగోలు చేస్తున్న 15 మందిని బేస్ మెంట్ రూంలోకి పంపేసి, దానికి తాళం వేసేసి, నిశ్శబ్దంగా ఉండాలని సూచించాడు. అలాగే ప్రైట్ ఎలివేటర్ ద్వారా మరికొందరిని బయటికి పంపి తాను కూడా బయటపడ్డాడు. దీంతో చాలా మంది ప్రాణాలతో బతికి బట్టకట్టి బాతిలికి ధన్యవాదాలు తెలిపారు. అంతమందిని కాపాడినప్పటికీ తీవ్రవాదుల దాష్టీకానికి నలుగురు బలయ్యారు.