: ఫ్రిజ్ లో దాక్కుని ప్రాణాలు కాపాడుకున్నారు
సాధారణంగా ఫ్రిజ్ లో దాక్కుంటే చల్లదనం తీవ్రతకు ప్రాణాలు పోయే అవకాశం ఉంటుంది. కానీ, వీరు మాత్రం ఫ్రిజ్ లో దాక్కుని ప్రాణాలను కాపాడుకున్నారు. వివరాల్లోకి వెళ్తే, తూర్పు ప్యారిస్ లోని కోషర్ సూపర్ మార్కెట్ లో ఉగ్రవాది జరిపిన కాల్పుల్లో నలుగురు మరణించారు. మరో ఐదు మంది మాత్రం సురక్షితంగా బయటపడగలిగారు. వీరంతా కూడా, సూపర్ మార్కెట్లోని ఓ ఫ్రిజ్ లో దాక్కుని ప్రాణాలను కాపాడుకున్నారు. వీరిలో మూడేళ్ల చిన్నారి కూడా ఉన్నాడు. చల్లదనానికి ఆ చిన్నారి తట్టుకోలేకపోతే, అతని తండ్రి తన కోటులో పిల్లవాడిని దాచి కాపాడుకున్నాడు. ఆపరేషన్ పూర్తయిన తర్వాత, మొబైల్ సిగ్నల్స్ ఆధారంగా వారిని పోలీసులు కాపాడారు.