: విమానం తోక భాగం కోసం సముద్రంలోకి గజ ఈతగాళ్లు


జావా సముద్రం లోపలికి 15 మంది గజ ఈతగాళ్లను ఇండోనేషియా ప్రభుత్వం పంపింది. డిసెంబర్ 28న ఎయిర్ ఏషియాకు చెందిన విమానం 162 మంది ప్రయాణికులతో కూలిపోయిన సంగతి తెలిసిందే. ఎయిర్ ఏషియా విమానం తోక భాగం ఆచూకీ తెలియడంతో దానిని వెలికితీయడానికి ఇండోనేషియా అన్వేషణ, రక్షణ విభాగం సన్నద్ధమైంది. క్రేన్లు, తేలియాడే బెలూన్ల సాయంతో తోక భాగాన్ని వెలికితీస్తామని ఇండోనేషియా అధికారులు తెలిపారు. కాగా, కూలిన ఎయిర్ ఏషియా క్యూజడ్ 8501 విమానానికి చెందిన బ్లాక్ బాక్స్ నుంచి ఇంకా సంకేతాలు వెలువడుతున్నట్టు అధికారులు వెల్లడించారు. గజ ఈతగాళ్లు విమానం తోకభాగం చేరుకునేందుకు సముద్రం సహకరించడంలేదు. తోక భాగం పడిన ప్రాంతంలో అడుగు భాగం మడ్డిగా ఉన్నట్టు అధికారులు తెలిపారు. వెలుతురు కూడా మందగించిన కారణంగా బ్లాక్ బాక్స్ వెలికితీతకు సమస్యలు ఎదురవుతున్నాయని వారు వెల్లడించారు.

  • Loading...

More Telugu News