: నవ్యాంధ్ర రాజధాని ప్రాంతంలో సింగపూర్ బృందం పర్యటన
నవ్యాంధ్రప్రదేశ్ నూతన రాజధాని పరిసర ప్రాంతాల్లో సింగపూర్ ప్రతినిధి బృందం పర్యటిస్తోంది. ఐదుగురు సభ్యులతో కూడిన సింగపూర్ బృందం నేటి ఉదయం నుంచి గుంటూరు జిల్లాలోని తుళ్లూరు పరిసర ప్రాంతాల్లో సుడిగాలి పర్యటన నిర్వహిస్తోంది. గుంటూరు శివారులోని మిర్చి యార్డును కూడా సింగపూర్ బృందం పరిశీలించింది. ఏపీ తాత్కాలిక రాజధానిని గుంటూరు మిర్చి యార్డులో ఏర్పాటు చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే సింగపూర్ ప్రతినిధులు మిర్చి యార్డులో పరిశీలన జరిపినట్లు తెలుస్తోంది.