: మమతా బెనర్జీకి ఫేస్ బుక్ లో మిలియన్ లైక్స్


పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సోషల్ నెట్వర్కింగ్ సైట్ ఫేస్ బుక్ లో దూసుకుపోతున్నారు. తాజాగా ఆమె ఎఫ్ బీ ఖాతా ఒక మిలియన్ (పది లక్షల) లైక్స్ ను దాటింది. ఈ సందర్భంగా దీదీ అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. "నా ఫేస్ బుక్ స్నేహితులకు కృతజ్ఞతలు. గత ఆదివారం నాడు నా ఎఫ్ బీ పేజ్ లైక్స్ సంఖ్య వన్ మిలియన్ మార్క్ దాటింది" అని ఎఫ్ బీ పేజ్ లో పోస్టు చేశారు. కాగా, కొత్త ఏడాది రోజున మమతా ట్విట్టర్ ఖాతా ప్రారంభించిన సంగతి తెలిసిందే. మరి ఇందులో దీదీ ఎంత యాక్టివ్ గా ఉంటారో చూడాలి!

  • Loading...

More Telugu News