: రాజకీయ నేత వ్యాఖ్యల్లా డీజీపీ ప్రకటనలు: వైసీపీ ఎమ్మెల్యే
ఏపీ డీజీపీ జేవీ రాముడు రాజకీయ నేతలా మాట్లాడుతున్నారని మంగళగిరి ఎమ్మెల్యే, వైసీపీ నేత ఆళ్ల రామకృష్ణారెడ్డి ఆరోపించారు. నవ్యాంధ్ర రాజధాని ఏర్పాటు కానున్న తుళ్లూరు పరిధిలోని గ్రామాల్లో ఇటీవల చోటుచేసుకున్న అగ్ని ప్రమాద ఘటనపై స్పందించిన డీజీపీ... అదో చిన్న విషయమని, దానిని మీడియానే పెద్దది చేసిందని వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. డీజీపీ వ్యాఖ్యలపై స్పందించిన ఆళ్ల రామకృష్ణారెడ్డి కొద్దిసేపటి క్రితం మీడియాతో మాట్లాడుతూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తుళ్లూరు పరిధిలోని బాధిత రైతుల స్థానంలో ఉంటే డీజీపీకి ఆ బాధేంటో తెలుస్తుందని అన్నారు. బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న డీజీపీ, రాజకీయ నేతలా మాట్లాడటం తగదని హితవు పలికారు.