: కర్ణాటక సీఎంకు తప్పిన ముప్పు... హెలికాప్టర్లో మంటలు
కర్ణాటక సీఎం సిద్ధరామయ్యకు పెను ముప్పు తప్పింది. ఆయన హెలికాప్టర్లో మంటలు చెలరేగాయి. బెంగళూరు నుంచి మైసూరు వెళ్లేందుకు సిద్ధరామయ్య హెలికాప్టర్ ఎక్కారు. అయితే, ఉన్నట్టుండి మంటలు కనిపించడంతో పైలట్ అప్రమత్తమయ్యాడు. వెంటనే స్పందించిన అధికారులు సీఎంను కిందికి దింపారు.