: పోలీసు శాఖలోని ఖాళీలు త్వరలో భర్తీ చేస్తాం: ఏపీ డీజీపీ రాముడు
ఆంధ్రప్రదేశ్ పోలీసు శాఖలోని ఖాళీలను త్వరలో భర్తీ చేస్తామని రాష్ట్ర డీజీపీ జేవీ రాముడు తెలిపారు. చిత్తూరు జిల్లాలో పర్యటిస్తున్న ఆయన కొద్దిసేపటి క్రితం విధి నిర్వహణలో ప్రతిభ చూపిన పోలీసు సిబ్బందికి రివార్డులను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో బీట్ కానిస్టేబుల్ వ్యవస్థను పటిష్టం చేయనున్నామని ప్రకటించారు. ఇందుకు ఉద్దేశించిన నూతన సాఫ్ట్ వేర్ ను డీజీపీ ప్రారంభించారు. ఎర్రచందనం స్మగ్లర్ల పూర్తిస్థాయి వివరాలున్న సాఫ్ట్ వేర్ ను కూడా ఆయన ప్రారంభించారు. నూతన సాఫ్ట్ వేర్ తో ఎర్రచందనం అక్రమరవాణాకు అడ్డుకట్ట వేస్తామని రాముడు ప్రకటించారు.