: మూడు రోజుల పాటు విశాఖ ఉత్సవాలు: మంత్రి గంటా
విశాఖ ఉత్సవాలను ఈ నెల 23 నుంచి మూడు రోజుల పాటు నిర్వహించనున్నట్లు ఏపీ విద్యా, మానవ వనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు ప్రకటించారు. ఆర్కే బీచ్ లో ఉత్సవాలకు సంబంధించిన ప్రధాన వేదికను ఏర్పాటు చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు. నేటి ఉదయం ఉత్సవాల వేదికల కోసం ఆర్కే బీచ్ తో పాటు ఉడా పార్కును మంత్రి పరిశీలించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఉత్సవాల ముగింపు కార్యక్రమాలకు సీఎం చంద్రబాబునాయుడు హాజరవుతారని తెలిపారు. ఉత్సవాలను కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్యనాయుడు ప్రారంభిస్తారన్నారు. ఉడా పార్కులో పుష్ప ప్రదర్శన ఏర్పాటు చేయనున్నామని ఆయన వెల్లడించారు.