: 'గుజరాత్ వైబ్రాంట్' సదస్సుకు జూపల్లికి ఆహ్వానం


గుజరాత్ రాజధాని గాంధీనగర్ లో జరగనున్న 'గుజరాత్ వైబ్రాంట్' సదస్సుకు తెలంగాణ రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావుకు ఆహ్వానం లభించింది. ఈ మేరకు గుజరాత్ ప్రభుత్వం ఆయనను ఆహ్వానించింది. ఈ నెల 12న మంత్రి, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి ప్రదీప్ చంద్ర గుజరాత్ వెళ్లనున్నారు. ఈ నెల 11 నుంచి 13 వరకు ఈ సదస్సు జరగనుంది. మరోవైపు, ఈ సదస్సుకు అమెరికా విదేశాంగ మంత్రి జాన్ కెర్రీ కూడా హాజరుకానున్నారు. ఈ సదస్సులో ప్రసంగించడంతో పాటు... ఒబామా భారత పర్యటనకు సంబంధించిన పలు అంశాలపై కెర్రీ చర్చలు జరపనున్నట్టు సమాచారం.

  • Loading...

More Telugu News