: కొత్త వలసలో వంచక బాబా రాసలీలలు... పోలీసుల అదుపులో నిందితుడు
ఏపీలో మరో వంచక బాబా రాసలీలలు కలకలం రేపుతున్నాయి. విజయనగరం జిల్లా కొత్తవలసలోని సన్ సిటీలో అత్యాధునిక ఆశ్రమాన్ని తెరచిన దయాసాగర్ బాబా, తన వద్దకు వచ్చే మహిళలపై లైంగిక వేధింపులకు తెర తీశారు. అంతేకాక పలువురు మహిళలను లోబరచుకుని రాసలీలల్లో మునిగితేలారు. బాబా వేధింపులపై విజయనగరంతో పాటు విశాఖ జిల్లాలోనూ పోలీసులకు ఫిర్యాదులు వెల్లువెత్తాయి. కొత్తవలస పోలీసులకు ఓ మహిళ పక్కా ఆధారాలతో ఫిర్యాదు చేసింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు బాబా ఆశ్రమంలో సోదాలు నిర్వహించారు. పలు కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్న పోలీసులు దయాసాగర్ బాబాను అదుపులోకి తీసుకున్నారు.