: ధైర్యంగా ఉండండి...విజయం మీదే: ఫ్రాన్స్ అధ్యక్షుడికి మోదీ ఫోన్


ఫ్రాన్స్ రాజధాని పారిస్ లో జరిగిన ఉగ్రదాడిని ప్రధాని నరేంద్ర మోదీ ఖండించారు. ఫ్రాన్స్ దేశాధ్యక్షుడు ఫ్రాంకోయిస్ హాలండ్ కు ప్రధాని మోదీ ఫోన్ చేశారు. ఉగ్రవాదులపై ఫ్రాన్స్ ప్రజలు విజయం సాధిస్తారని ఆకాంక్షించారు. ఫ్రాన్స్ ప్రజలకు ఆయన సంఘీభావం ప్రకటించారు. ముష్కరుల దాడిలో ప్రాణాలు కోల్పోయిన వారికి సంతాపం తెలిపిన ఆయన, వారి ఆత్మకు శాంతి చేకూరుతుందని ధైర్యం చెప్పారు. కాగా, ముష్కరులు ప్రింటింగ్ ప్రెస్ గోడౌన్ లో దాక్కుని, ఓ మహిళ సహా ఆమె పిల్లలను బందీలుగా చేసుకున్నట్టు సమాచారం. వారితో భద్రతాదళాలు సంప్రదింపులు జరుపుతున్నాయి.

  • Loading...

More Telugu News