: విదేశీ పర్యటనా? కొత్త మెర్సిడాన్ కారా?: హెచ్ సీఎల్ ఉద్యోగులకు బంపర్ ఆఫర్
హెచ్ సీఎల్ కంపెనీ సంస్థలో ప్రతిభావంతులైన ఉద్యోగులకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. ప్రముఖ సాఫ్ట్ వేర్ సంస్థ హెచ్ సీఎల్, తమ సంస్థలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన 130 మంది ఉద్యోగులను ఎంపిక చేసింది. వీరికి కుటుంబ సభ్యులతో విదేశీ పర్యటన కావాలా? లేక విలాసవంతమైన మెర్సిడాన్ కారు కావాలా? కోరుకోండంటూ ఆఫర్ ప్రకటించింది. ఉద్యోగి ఏది కోరుకుంటే అదే అందజేస్తామని ప్రకటించింది. బంపర్ ఆఫర్ తో పాటు జీతం కూడా పెంచుతున్నట్టు హెచ్ సీఎల్ ప్రకటించింది. ఉద్యోగులు కుటుంబంతో ఆనందంగా ఉంటే మరింత ప్రతిభ ప్రదర్శిస్తారని సంస్థ వ్యాఖ్యానించింది.