: ప్రజలు బయటికి రావద్దు...అష్టదిగ్బంధనం చేసిన ఫ్రాన్స్ పోలీసులు
ఫ్రాన్స్ రాజధాని పారిస్ లో కాల్పులకు తెగబడిన తీవ్రవాదులను పట్టుకునేందుకు తీవ్రంగా యత్నిస్తున్నారు. ఈశాన్య ఫ్రాన్స్ లోని డమార్టన్ ఎన్ గోయిల్ పట్టణంలోని ఓ ప్రింటింగ్ ప్రెస్ కు సంబంధించిన గోడౌన్ లో దాక్కున్న ఇద్దరు తీవ్రవాదులు, బందీలను అడ్డుపెట్టుకుని సవాళ్లు విసురుతుండడంతో, వారిని బయటికి రప్పించేందుకు పోలీసులు సంప్రదింపులు జరుపుతున్నారు. కాగా, డమార్టన్ ఎన్ గోయిల్ పట్టణంలోని ప్రజలను బయటికి రావద్దంటూ పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. సుమారు వెయ్యి మంది పోలీసులు పట్టణంలో పహారా కాస్తున్నారు. పట్టణంలోని అన్ని దారులను పోలీసులు మూసివేశారు. గోడౌన్ పై హెలీకాప్టర్ నిత్యం తిరుగుతూ ఉగ్రవాదులు తప్పించుకోకుండా పహారా కాస్తోంది.