: సంక్రాంతి సెలవు మార్చిన కేంద్ర ప్రభుత్వం
కేంద్ర ప్రభుత్వం సంక్రాంతి సెలవును మార్చింది. సాధారణంగా సంక్రాంతి సెలవును జనవరి 14న ప్రకటించే కేంద్రం ఈ ఏడాది జనవరి 15న సంక్రాంతిగా పేర్కొంటూ ప్రకటన జారీ చేసింది. సిద్ధాంతులు పరస్పర విరుద్ధమైన సమాచారంతో క్యాలెండర్లు విడుదల చేస్తుండడంతో, కొన్ని క్యాలెండర్లలో సంక్రాంతి జనవరి 14 అని, మరికొన్నిటిలో జనవరి 15 అని పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో కేంద్రం ఈ నెల 15న సంక్రాంతి సెలవు ప్రకటించింది. దీనితో పాటు జనవరి 14న ఐచ్ఛిక సెలవుగా పేర్కొంది. అంటే జనవరి 14న ఆప్షనల్ హాలీడే అన్నమాట.