: పవన్ కల్యాణ్ అభిమానిపై దాడికి పాల్పడిన వాళ్లు దొరికారు!


'గోపాల గోపాల' ఆడియో వేడుక సందర్భంగా గుంటూరు జిల్లా పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కరుణ శ్రీనివాస్ గొంతు కోసిన ఘటనలో నలుగురు అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆడియో వేడుక సందర్భంగా జరిగిన దాడికి సంబంధించిన వీడియో పుటేజీ ఆధారంగా వీరిని గుర్తించినట్టు పోలీసులు తెలిపారు. పోలీసుల అదుపులో ఉన్న నలుగురు నిందితులు కుమారస్వామి, నరేష్ కుమార్, రంజిత్, రాకేష్ అని తెలుస్తోంది. వీరి దాడిలో కరుణ శ్రీనివాస్ తీవ్రంగా గాయపడగా, ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన అతనిని పవన్ కల్యాణ్ తన ఆఫీసుకు పిలిపించుకుని రూ.50 వేల రూపాయల సాయం చేసిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News