: సినిమా ఛాన్స్ కోసం ఆశపడి అత్యాచారానికి గురైంది!


సినీ రంగంలో 'పాకుడురాళ్లు' ఎన్నో ఉన్నాయి అని దివంగత రచయిత రావూరి భరద్వాజ చెప్పినట్టు... సినిమా ఛాన్స్ కోసం ఆశపడిన ఓ యువతి అత్యాచారానికి గురైన సంఘటన ముంబైలో వెలుగు చూసింది. బాలీవుడ్ ఓ కలల ప్రపంచం. బాలీవుడ్ లో అవకాశం అంటే ఎవరైనా ఎగిరి గెంతేస్తారు. ఇతర భాషా సినీరంగాల్లో ఉన్నత స్థానాల్లో ఉన్నవారైనా సరే బాలీవుడ్ అవకాశం కోసం అర్రులు చాస్తారు. బాలీవుడ్ లో చిన్న చిన్న పాత్రలు చేస్తూ ఇప్పుడిప్పుడే నిలదొక్కుకుంటున్న ఓ నటికి సినిమాలో అవకాశం ఇస్తానని మాయమాటలు చెప్పి అత్యాచారానికి పాల్పడ్డాడో ఘనుడు. దీనిపై ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగు చూసింది. సుబర్బన్ చార్ కోప్ నిర్వహిస్తున్న ఓ ఈవెంట్ లో సదరు నటి పార్టిసిపేట్ చేసింది. అక్కడ ముప్థాల్ ఘడియాలి అనే వ్యక్తిని చార్ కోప్ ఆమెకు పరిచయం చేశాడు. త్వరలోనే సినిమా తీయబోతున్నానని, అందులో అవకాశం ఇస్తానని ముప్థాల్ ఆశచూపాడని బాధితురాలు తెలిపింది. సినిమాకి సంబంధించిన కాంట్రాక్ట్ పై సంతకం చేయాలని పిలిచి కూల్ డ్రింక్ ఇచ్చాడని, స్పృహ కోల్పోయిన తాను లేచి చూసి అత్యాచారానికి గురైనట్టు గ్రహించానని ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు, ఈవెంట్ మేనేజర్ సుబర్బన్ చార్ కోప్ ను అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

  • Loading...

More Telugu News