: గవర్నర్ పాలన కిందకు జమ్మూ కాశ్మీర్!
జమ్మూకాశ్మీర్ లో గవర్నర్ పాలనకు కేంద్రం సుముఖత వ్యక్తం చేసింది. ఈ మేరకు ఆ రాష్ట్రంలో గవర్నర్ పాలన విధించాలని గవర్నర్ ఎన్ఎన్ వోహ్రా సమర్పించిన నివేదికను కేంద్ర హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ గురువారం రాత్రి పరిశీలించారు. వోహ్రా ప్రతిపాదనకు కేంద్రం సానుకూలంగా స్పందించింది. గతేడాది ఈ రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు జరిగినప్పటికీ ఏ పార్టీకి ప్రభుత్వం ఏర్పాటుచేసే సంఖ్యాబలం రాలేదు. 28 స్థానాలు గెలుచుకుని మొదటి స్థానంలో పీడీపీ నిలిచినప్పటికీ బీజేపీ (25), కాంగ్రెస్ లు సహకరించకపోవడం, సంకీర్ణం కూడా ఏర్పడకపోవడంతో ప్రభుత్వ ఏర్పాటు సాధ్యపడలేదు. దాంతో ఈ రాష్ట్రంలో రాజకీయ ప్రతిష్టంభన ఏర్పడింది. అటు, ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగేందుకు ఒమర్ అబ్దుల్లా విముఖత వ్యక్తం చేశారు.