: హైదరాబాదులో తెలంగాణ బ్రాహ్మణ పరిషత్ భవన్ కు పది కోట్ల రూపాయలు: కేసీఆర్


హైదరాబాదులో తెలంగాణ బ్రాహ్మణ పరిషత్ భవన్ ను ఏర్పాటు చేస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. వరంగల్ లో జరుగుతున్న తెలంగాణ అర్చక సదస్సులో పాల్లొన్న సందర్భంగా ఈ మేరకు కేసీఆర్ కొద్దిసేపటి క్రితం ప్రకటన చేశారు. భవన నిర్మాణానికి రూ.10 కోట్లు కేటాయిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో భాగంగా చినజీయర్ స్వామి ఆశీస్సులు తీసుకున్న కేసీఆర్, రాష్ట్రంలో అర్చకుల సమస్యల పరిష్కారానికి కట్టుబడి ఉన్నామని ప్రకటించారు. ఆధ్యాత్మిక భావాలు శాంతికి దోహదం చేస్తాయని ఆయన అభిప్రాయపడ్డారు. ఆలయాల్లో ధూపదీప నైవేద్యానికి ఇస్తున్న రూ.2,500లను రూ.6 వేలకు పెంచనున్నట్లు కేసీఆర్ తెలిపారు.

  • Loading...

More Telugu News