: 'మా స్లోగన్ ఇదీ' అంటున్న చంద్రబాబు


గుజరాత్ లోని గాంధీనగర్ లో జరుగుతున్న 'ప్రవాసీ భారతీయ దివస్' కార్యక్రమంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ఉపన్యసిస్తూ, ప్రధాని నరేంద్ర మోదీ 'మేక్ ఇన్ ఇండియా' నినాదంతో వెళుతున్నారని, 'మేడ్ ఇన్ ఆంధ్రప్రదేశ్' అన్నది తమ స్లోగన్ అని చెప్పారు. వస్తూత్పాదన రంగంలో ఏపీ అగ్రగామిగా నిలవాలన్న లక్ష్యంతో పనిచేస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలో ప్రతి గ్రామాన్ని స్మార్ట్ గ్రామంగా తీర్చిదిద్దుతామని అన్నారు. విశాఖలో మెగా ఐటీ హబ్ ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. పరిశ్రమల అనుమతి కోసం సింగిల్ డెస్క్ విధానం అమలు చేస్తామని పారిశ్రామికవేత్తలను ఆకర్షించే ప్రయత్నం చేశారు. భూముల వివరాలను ఆన్ లైన్ లో ఉంచుతామన్నారు. త్వరలో ఓడ రేవుల విధానం ప్రకటిస్తామని తెలిపారు. నదుల అనుసంధానంతో ఏపీని కరవురహిత రాష్ట్రంగా తీర్చిదిద్దుతామని ఉద్ఘాటించారు. ఇక, ఏపీలో ప్రపంచస్థాయి రాజధాని నిర్మాణం చేపడుతున్నామని, సింగపూర్ మాస్టర్ ప్లాన్ సిద్ధం చేస్తోందని వివరించారు. రాజధాని నిర్మాణంపై జపాన్ కూడా ఆసక్తిగా ఉందని పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News