: కళ్లల్లో కారం చల్లి... విశాఖలో రియల్టర్ పై కత్తులతో దాడి


ఆంధ్రప్రదేశ్ వాణిజ్య రాజధానిగా ఎదుగుతున్న విశాఖపట్నంలో దాడులు పెరుగుతున్నాయి. నేటి ఉదయం నగరంలో స్థిరాస్తి వ్యాపారిపై గుర్తు తెలియని దుండగులు హత్యాయత్నం చేశారు. కళ్లల్లో కారం కొట్టి కత్తులతో విరుచుకుపడ్డారు. అయితే ఊహించని దాడి నుంచి క్షణాల్లో మేల్కొన్న సదరు వ్యాపారి దుండగుల బారి నుంచి చాకచక్యంగా తప్పించుకున్నారు. అనంతరం నేరుగా పోలీస్ స్టేషన్ కు వెళ్లిన రియల్టర్, తనపై జరిగిన దాడికి సంబంధించి ఫిర్యాదు చేశారు. బాధితుడి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు నిందితుల కోసం గాలింపు ప్రారంభించారు.

  • Loading...

More Telugu News