: చక్రాలు విరిగి కల్వర్టును ఢీకొని కాల్వలో బోల్తా పడ్డ 'పల్లె వెలుగు'
సరైన కండిషన్లో లేని పల్లె వెలుగు బస్సులు ప్రజల ప్రాణాలు తీస్తున్నాయి. అనంతపురం జిల్లాలో ఓ పల్లె వెలుగు బస్సు లోయలో పడి 18 మంది మరణించిన దుర్ఘటన మరువక ముందే అటువంటిదే మరో ఘటన చోటుచేసుకుంది. చిత్తూరు జిల్లా పీటీఎం మండలం మారుగానిపల్లె వద్ద ఈ ఉదయం ఆర్టీసీ పల్లె వెలుగు బస్సు ప్రమాదానికి గురైంది. ముందు చక్రాలు ఊడిపోయి అదుపుతప్పిన బస్సు అనంతరం కల్వర్టును ఢీకొని కాల్వలో పడినట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో పదిమంది గాయపడ్డట్టు తెలుస్తోంది. బస్సు డ్రైవర్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ప్రమాదంపై మరిన్ని వివరాలు తెలియాల్సివుంది.