: తిరుపతి నగరంలో చిరుత సంచారం... ఆవు, దూడపై దాడి
వెంకటేశ్వర అభయారణ్యం నుంచి ఓ చిరుత తిరుపతి నగర పరిసరాల్లోకి వచ్చేసింది. స్విమ్స్ ఆస్పత్రి పరిసరాల్లోకి వచ్చేసిన చిరుత పులి అక్కడ ఓ ఆవు, దూడపై దాడి చేసి చంపేసింది. దీంతో ఆస్పత్రిలోని వైద్యులు, సిబ్బంది, రోగులు తీవ్ర భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. తిరుపతి నుంచి తిరుమల వెళ్లే నడకదారిలో పలుమార్లు పులులు కనిపించినా, నగర పరిసరాల్లోకి చిరుత రావడం ఇదే తొలిసారి. దీంతో తీవ్ర భయాందోళనలకు గురైన నగరవాసులు అటవీ శాఖ సిబ్బందిని ఆశ్రయించారు. తక్షణమే చిరుతను బంధించాలని వారు అధికారులకు విజ్ఞప్తి చేశారు.