: భారీగా పెరగనున్న సెల్లు బిల్లులు!
ప్రీ పెయిడ్, పోస్ట్ పెయిడ్ మొబైల్ బిల్లులు భారీగా పెరగనున్నాయి. వాయు తరంగాల కోసం అధిక మొత్తాన్ని చెల్లించాల్సి ఉండటంతో టారిఫ్ ధరలు పెంచడం తప్ప మరో మార్గం లేదని టెలికాం కంపెనీలు భావిస్తున్నాయి. ఈ మేరకు సీవోఏఐ డైరెక్టర్ జనరల్ రాజన్ ఎస్ మాథ్యూ టెలికం మంత్రి రవిశంకర్ ప్రసాద్ కు లేఖ రాసారు. స్పెక్ట్రమ్ కనీస ధరను కేంద్రం పెంచడంతో టెలికం సంస్థల అప్పు రూ.2.5 లక్షల కోట్లకు చేరుకునే అవకాశం ఉందని ఆయన ప్రస్తావించారు. కాగా, ఈ లేఖను ప్రధాని నరేంద్ర మోదీకి, ఆయన ప్రధాన కార్యదర్శి నృపేంద్ర మిశ్రాకు కూడా పంపినట్టు తెలుస్తోంది. కేంద్రం నిర్ణయం వెలువడిన వెంటనే మొబైల్ చార్జీలను పెంచే యోచనలో టెల్కోలున్నాయి.