: హైదరాబాదులో వాకర్స్ పైకి దూసుకెళ్లిన కారు... ముగ్గురు యువకుల మృతి


హైదరాబాదులో అదుపు తప్పుతున్న వాహనాల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. హైదరాబాద్ శివారు ప్రాంతంలో కొద్దిసేపటి క్రితం ఓ కారు బీభత్సం సృష్టించింది. మార్నింగ్ వాక్ కోసం వచ్చిన వారిపైకి అదుపు తప్పి దూసుకెళ్లిన ఓ కారు ముగ్గురు యువకులను పొట్టనబెట్టుకుంది. మహేశ్వరం మండలం నాగారం పరిధిలో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. మృతులను నాగరాజు, శ్రీశైలం, జనార్ధన్ లుగా గుర్తించారు. ప్రమాదం జరిగిన వెంటనే కారు డ్రైవర్ పరారయ్యాడు. కారులో మద్యం బాటిళ్లు లభ్యమైనట్లు సమాచారం. మద్యం మత్తులో కారును నడిపిన డ్రైవరే ప్రమాదానికి కారణమని తెలుస్తోంది.

  • Loading...

More Telugu News