: ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో విశాఖ పాఠశాల
ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో విశాఖపట్టణానికి చెందిన వండర్ కిడ్స్ పాఠశాల చోటు సంపాదించుకుంది. నిన్న జరిగిన ఓ పరీక్షలో ఆ పాఠశాలకు చెందిన రెండవ తరగతి విద్యార్థులు 100 లెక్కలకు కేవలం 10.2 నిమిషాల్లోనే సమాధానాలిచ్చి రికార్డు పుటలకెక్కారు. విశాఖపట్టణంలోని ఆంధ్రా యూనివర్సీటీలో జరిగిన ఈ పరీక్షలో పాల్గొన్న విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ కనబరిచారు. ఏయూ వీసీ జీఎస్ఎన్ రాజు, మ్యాధ్స్ డిపార్ట్ మెంట్ హెచ్ వోడీ రంగారావు, విశాఖ బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ప్రీతీరాజ్, ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ ప్రతినిధి భరద్వాజల సమక్షంలో ఈ పరీక్ష జరిగింది. ఈ పరీక్షలో వండర్ కిడ్న్ పాఠశాలకు చెందిన 30 మంది రెండవ తరగతి విద్యార్థులు పాల్గొన్నారు.