: గతంలో జరిగిన వాటిని మర్చిపోండి... మా రాష్ట్రానికి రండి: మమతా దీదీ
గతంలో జరిగిన ఘటనలను మర్చిపోదామని, వాటికి క్షమాపణ చెబుతున్నానని పారిశ్రామిక వేత్తలకు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ చెప్పారు. కోల్ కతాలో రెండు రోజులపాటు జరిగిన అంతర్జాతీయ వాణిజ్య సదస్సు ముగింపు కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ, గతంలో జరిగిన చెడును వదిలేద్దామని పిలుపునిచ్చారు. 'నేటి గురించి ఆలోచిద్దాం. రేపటి కోసం కష్టించి పనిచేద్దాం' అంటూ మమత ఉత్సాహం నింపారు. వామపక్ష ప్రభుత్వ హయాంలో జరిగిన ఆర్థిక దుర్వినియోగానికి, అసమర్ధ నిర్వహణకు తాను క్షమాపణ అడుగుతున్నానని ఆమె పేర్కొన్నారు. ఇకనైనా బెంగాల్ లో పెట్టుబడులు పెట్టాలని ఆమె పారిశ్రామిక వేత్తలను కోరారు.