: ఈ నెలలోనే విశాఖలో ఐఐఎంకు శంకుస్థాపన: మంత్రి గంటా
ఈ నెల 17న విశాఖలో ఐఐఎంకు శంకుస్థాపన చేయనున్నట్టు ఏపీ విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు. అదే రోజున తిరుపతిలో ఐఐటీ, ఐఐఎన్ఆర్ లకు కూడా శంకుస్థాపన జరగనున్నట్టు చెప్పారు. విశాఖలో విద్యా నిపుణులు, అధికారులతో రాష్ట్ర విద్యారంగంపై సదస్సు నిర్వహించనున్నట్టు మంత్రి వివరించారు. కాగా, ఎంసెట్ విషయంలో విద్యార్థులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అనంతపురంలో పునరుద్ఘాటించారు. ముందు నిర్ణయించిన తేదీల్లోనే ఎంసెట్ నిర్వహిస్తామని మంత్రి పేర్కొన్నారు.