: 'షమితాబ్' ట్రయలర్ కు ముగ్ధురాలైన ఐశ్వర్యరాయ్


ఇటీవల విడుదలైన 'షమితాబ్' ట్రయలర్ చూసి అందాల భామ ఐశ్వర్యరాయ్ ముగ్ధురాలైంది. తన మామ, నటుడు అమితాబ్ బచ్చన్ విభిన్న అవతారంలో కనిపించనున్న ఈ సినిమాను బిగ్ స్క్రీన్ పై చూడాలనుకుంటున్నట్టు తెలిపింది. ముంబయిలో ఓ ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొన్న ఐష్ మాట్లాడుతూ, "చాలా అద్భుతంగా ఉంది. ఇందులో ఐడియా చాలా ఆకర్షణీయంగా ఉంది. ట్రయలర్ లో చూపించిన దానికంటే ఎక్కవగా తెలుసుకోవాలనుకుంటున్నా. ఈ ప్రోడక్ట్ ను చూసేందుకు చాలా చాలా ఎగ్జైట్ గా ఉన్నా. అందుకే ఈ సినిమా చూడాలనుకుంటున్నా. బాల్కీ, పా (అమితాబ్) కలసి చేసినప్పుడు చాలా గొప్పగా ఉంటుంది" అని ఐశ్వర్య తెలిపింది. దర్శకుడు ఆర్.బాల్కీ రూపొందిస్తున్న ఈ చిత్రంలో కమల్ హసన్ కుమార్తె అక్షర్ హసన్ నటిగా పరిచయమవుతోంది.

  • Loading...

More Telugu News