: అట్టుడుకుతున్న ఫ్రాన్స్... మసీదులపై దాడులు!
ఓ పత్రికా కార్యాలయంపై నిన్న జరిగిన ఉగ్రవాదుల దాడి తరువాత ఫ్రాన్స్ లో శాంతిభద్రతలను అదుపులో ఉంచేందుకు పోలీసులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఉగ్రవాదుల దాడులకు నిరసనగా, ఫ్రాన్స్ ప్రజలు పలు మసీదులపై దాడులు చేస్తున్నట్టు వార్తలు వెలువడ్డాయి. పారిస్ పశ్చిమ ప్రాంతం లెమాన్స్ లో ఓ మసీదు వద్ద ఖాళీ గ్రెనేడ్లు విసిరారు. అనంతరం కాల్పులు కూడా జరిపినట్టు తెలుస్తోంది. అటు, పారిస్ దక్షిణ ప్రాంతంలో ఈ ఉదయం బులెట్ ప్రూఫ్ జాకెట్ ధరించి వచ్చిన వ్యక్తి పోలీసులపై కాల్పులు జరుపగా ఒక మహిళా అధికారి మృతి చెందారు. ఈ ఘటనతో ప్రజలు మరింత ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఫ్రాన్స్ లో మసీదులపై జరుగుతున్న దాడుల గురించి మరిన్ని వివరాలు తెలియాల్సివుంది.