: పేషెంట్ల నుంచి వంద, రెండొందలు తీసుకోవడం లంచం కాదు: మంత్రి రాజయ్య


స్వతహాగా వైద్యుడైన తెలంగాణ ఉప ముఖ్యమంత్రి, ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ టి.రాజయ్య ఓ విషయంలో వైద్యులు, ఆసుపత్రి సిబ్బంది పక్షాన నిలిచారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో చికిత్స కోసం పేషెంట్ల నుంచి ఆసుపత్రి సిబ్బంది, వైద్యులు డబ్బులు తీసుకోవడం తప్పుకాదన్నారు. "పేషెంట్ల నుంచి ఆసుపత్రి సిబ్బంది రూ.100, రూ.200లు తీసుకుంటే అది తప్పేం కాదు. దయచేసి దానిని లంచంగా చూడకండి" అని మంచిర్యాల ఆసుపత్రి నుంచి వెళ్ళే సమయంలో విలేకరులతో అన్నారు. ఆసుపత్రి సిబ్బంది బాగా ఇబ్బంది పెడుతుంటే ఆర్డీఓ, డీఎంహెచ్ఓ, జిల్లా కలెక్టర్ కు ఫోన్ లో పేషెంట్లు ఫిర్యాదులు చేయాలన్నారు. కాగా నిన్నటివరకూ రాష్ట్రంలో స్వైన్ ఫ్లూ బారిన పడి ఐదుగురు మరణించారని చెప్పిన రాజయ్య, తాజాగా అసలు ఆ మరణాలే లేవని మాట మార్చడం గమనార్హం.

  • Loading...

More Telugu News