: జగన్ అక్రమాస్తుల కేసులో ఐఏఎస్ రత్నప్రభకు ఊరట!
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులో సీనియర్ ఐఏఎస్ అధికారి రత్నప్రభకు ఊరట లభించింది. జగన్ అక్రమాస్తుల కేసులోని ఇందూటెక్ వ్యవహారంలో రత్నప్రభ దోషేనంటూ సీబీఐ చేస్తున్న వాదనను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. ఈ కేసులో రత్నప్రభకు ఎలాంటి ప్రమేయం లేదన్న హైకోర్టు తీర్పును సీబీఐ సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. సీబీఐ దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ ను కొద్దిసేపటి క్రితం సుప్రీంకోర్టు కొట్టివేసింది. దీంతో జగన్ అక్రమాస్తుల కేసు నుంచి రత్నప్రభకు విముక్తి లభించినట్లైంది.