: కంటోన్మెంట్ లో ఉద్రిక్తత... టీఆర్ఎస్, టీడీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ


సికింద్రాబాద్ పరిధిలోని కంటోన్మెంట్ లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కంటోన్మెంట్ బోర్డు ఎన్నికల ప్రచారం సందర్భంగా టీఆర్ఎస్, టీడీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. కంటోన్మెంట్ ఎన్నికల ప్రచారంలో డబ్బులు పంచుతున్నారంటూ పరస్పర ఆరోపణలు గుప్పించుకున్న ఇరుపార్టీల కార్యకర్తలు బాహాబాహీకి దిగారు. కంటోన్మెంట్ లోని నాలుగో వార్డులో ఈ ఘటన చోటుచేసుకుంది. ఘర్షణ నేపథ్యంలో రంగప్రవేశం చేసిన పోలీసులు ఇరుపార్టీల కార్యకర్తలను చెదరగొట్టారు. ఇరుపార్టీలకు చెందిన కార్యకర్తల ఘర్షణ, పోలీసుల రంగప్రవేశంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

  • Loading...

More Telugu News