: బాబ్రీ మసీదు అల్లర్ల కేసు నిందితుడు అరెస్ట్... రెండు దశాబ్దాల తర్వాత చిక్కిన నజీర్


బాబ్రీ మసీదు అల్లర్ల కేసు నిందితుడు నజీర్ ను హైదరాబాద్ పోలీసులు ఎట్టకేలకు అరెస్ట్ చేశారు. బాబ్రీ మసీదు విధ్వంసం నేపథ్యంలో కర సేవకులు పాపయ్య గౌడ్, నందరాజు గౌడ్ లపై జరిగిన దాడి కేసులో నజీర్ నిందితుడు. హుమయూన్ నగర్ లో అతడిపై కేసు నమోదైంది. గతంలో అరెస్టై, బెయిల్ పై విడుదలైన తర్వాత అతడు దుబాయ్ పారిపోయాడు. ఈ నేపథ్యంలో 1992 నుంచి అతడు పోలీసులకు చిక్కకుండా తిరుగుతున్నాడు. దుబాయ్ నుంచి హైదరాబాద్ వచ్చిన అతడిని నగర పోలీసులు వలపన్ని పట్టుకున్నారు. ఫజీయుద్దీన్ గ్యాంగ్ లో కీలక సభ్యుడిగా ఉన్న నజీర్ పై అబిడ్స్ పోలీస్ స్టేషన్ లోనూ కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం అతడిని రహస్య ప్రాంతానికి తరలించిన పోలీసులు కీలక సమాచారం రాబడుతున్నట్లు సమాచారం.

  • Loading...

More Telugu News