: సంక్రాంతి సందర్భంగా డీజే సౌండ్ పై హైదరాబాదులో నిషేధాజ్ఞలు
సంక్రాంతి పర్వదినం సందర్భంగా డీజే లాంటి పెద్ద శబ్దాలకు సంబంధించిన సౌండ్ సిస్టమ్స్ ను 15 రోజుల పాటు నిషేధిస్తున్నట్టు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ మహేందర్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. ఈ ఉత్తర్వులు తక్షణం అమల్లోకి వస్తాయని ఆయన తెలిపారు. నేటి ఉదయం 6 గంటల నుంచి 22వ తేదీ వరకు నిషేధాజ్ఞలు పాటించాలని మహేందర్ రెడ్డి కోరారు. దీంతోపాటు బహిరంగ ప్రదేశాల్లో 14వ తేదీ వరకు మద్యం సేవించడంపై కూడా నిషేధం విధిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.