: కొత్త కుర్రాడు లోకేశ్ రాహుల్ హాఫ్ సెంచరీ... నిలకడగా భారత బ్యాటింగ్
నాలుగో టెస్టులో తడబడుతున్నా భారత బ్యాటింగ్ నిలకడగానే సాగుతోంది. ఇద్దరు సీనియర్లు కళ్ల ముందటే విఫలమైనా ఏమాత్రం తొట్రుపాటుకు గురి కాని కొత్త కుర్రాడు లోకేశ్ రాహుల్ (64) తన రెండో టెస్టులోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకుని సెంచరీ దిశగా సాగుతున్నాడు. సెలెక్టర్లు తనపై పెట్టిన నమ్మకాన్ని నిరూపించుకున్నాడు. ఆస్ట్రేలియాతో జరిగిన మూడో టెస్టు ద్వారా టెస్టు క్రికెట్ లోకి అడుగుపెట్టిన కర్ణాటక బ్యాట్స్ మన్ లోకేశ్, రెండో టెస్టులోనే తన సత్తా చాటాడు. కెప్టెన్ విరాట్ కోహ్లీ(32)కి సహకరిస్తూనే తన స్కోరును నింపాదిగా పెంచుకుంటున్నాడు. రోహిత్ శర్మ ఔటైన తర్వాత వికెట్లు పడకుండా జాగ్రత్తగా వ్యవహరిస్తున్న లోకేశ్, కోహ్లీలు... జట్టు బ్యాటింగ్ ను నిలకడగా కొనసాగిస్తున్నారు. 65.2 ఓవర్లు ముగిసేసరికి టీమిండియా రెండు వికెట్ల నష్టానికి 152 పరుగులు చేసింది.