: సముద్రంలో తప్పిపోయిన మత్స్యకారులను రక్షించిన కోస్ట్ గార్డ్


ఎటు చూసినా నీరే...చెట్టు, పుట్టా, గట్టూ ఏదీ కానరాదు, ఎటుపోతున్నామో తెలియదు, అసలు తీరం ఏ దరిన ఉంది, తీరానికి చేరుతామో లేదోనన్న ఆశ లేశమాత్రమైనా లేని విశాఖ మత్స్యకారులను కోస్ట్ గార్డ్ రక్షించింది. విశాఖ తీరానికి 30 నాటికల్ మైళ్ల దూరంలో దారీ తెన్నూ కానక చిక్కుకుపోయిన ఏడుగురు మత్స్యకారులను కోస్ట్ గార్డ్ పోలీసులు తీరం చేర్చారు. నాలుగు రోజుల క్రితం ఈ ఏడుగురు మత్స్యకారులు కింగ్ ఫిషర్-3 మరపడవతో సముద్రంలో చేపల వేటకు వెళ్లారు. పడవలో సాంకేతిక లోపం తలెత్తి నిలిచిపోవడంతో సముద్రంలో చిక్కకుపోయారు. మత్స్యకారుల ఫిర్యాదుతో గాలింపు చేపట్టిన పోలీసు బలగాలు, మెరైన్ సిబ్బంది చివరికి వారిని రక్షించారు.

  • Loading...

More Telugu News