: ఈఫిల్ టవర్ మూసివేత...ఫ్రాన్స్ లో హై అలెర్ట్
ఫ్రాన్స్ లోని ఈఫిల్ టవర్ ను మూసివేస్తున్నట్టు అధికారులు తెలిపారు. చార్లి హెబ్డొ పత్రికా కార్యాలయంపై జరిగిన ఉగ్రదాడితో ఫ్రాన్స్ అప్రమత్తమైంది. ఫ్రాన్స్ లో రెడ్ అలెర్ట్ ప్రకటించారు. పత్రికా కార్యాలయంపై దాడికి పాల్పడి ఎడిటర్ సహా 9 మంది జర్నలిస్టులు, ఇద్దరు పోలీసులను పొట్టనబెట్టుకున్న ఉగ్రవాదుల కోసం వేట మొదలైంది. భద్రతా చర్యల్లో భాగంగా, పర్యాటకుల తాకిడి అధికంగా ఉండే ఈఫిల్ టవర్ ను మూసివేస్తున్నట్టు ప్రకటించారు. ఇప్పటికే ప్రపంచ దేశాల నుంచి ఫ్రాన్స్ కు మద్దతు లభిస్తోంది.